ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ లో గెలిచిన 11 మంది రాజీనామా

ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. మా అసోషియేషన్‌ ఎన్నికల గెలిచిన 11 మంది ప్యానెల్‌ సభ్యులంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్‌ రాజ్‌ ప్రకటించారు. మా ఎన్నికల వివాదంపై ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ… మొన్న జరిగిన మా అసోషియేషన్‌ ఎన్నికల్లో రౌడీయిజం జరిగిందని ఫైర్‌ అయ్యారు.

ఎక్కెక్కడి నుంచి మనుషులను తీసుకువచ్చారని.. క్రమశిక్షణ లేకుండా.. బెనర్జీ మీద చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. ఎవరు అడ్డు వచ్చిన విజయం మాదే అనే విష్ణు చెప్పిన డైలాగ్ బాధ కలిగించిందన్నారు. మేము ఆ టీం లో పని చేయలేమని.. అందుకే రాజీనామా చేస్తున్నామన్నారు ప్రకాశ్‌ రాజ్‌. తాము అక్కడ ఉండటం వల్ల సంక్షేమం ఆగిపోతుంది అని… విష్ణు చేసే అభివృద్ధికి అడ్డు రాకుండా ఉండాలని… రాజీనామా చేస్తున్నామని స్పష్టం చేశారు ప్రకాశ్ రాజ్‌. మీకు కావల్సిన వారిని పెట్టుకుని పని చేయండి విష్ణు కు చురకలు అంటించారు.