అమ్మనా బూతులు తిట్టారంటూ.. బోరున ఏడ్చేసిన బెనర్జీ !

మా అసోషియేషన్‌ ఎన్నికల పోలింగ్‌ సమయంలో తనను అమ్మనా బూతులు తిట్టారని.. మీడియా ముందే కంట తడి పెట్టుకున్నారు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు బెనర్జీ. మా ఎన్నికల వివాదంపై ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌… మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్బంగా బెనర్జీ మాట్లాతుడూ… తనను ముఠా నాయకుడు అని నరేష్ అన్నాడని… అయినా మౌనంగా ఉన్నానని చెప్పారు బెనర్జీ. ఎన్నికల్లో తాను గెలిచినా… సంతోషం లేదని.. కంటతడి పెట్టుకున్నారు బెనర్జీ.

పోలింగ్‌ కేంద్రం లోనే మోహన్ బాబు నోటికి వచ్చినట్లు తిట్టారని.. విష్ణు గొడవ వద్దు అన్నారని గుర్తు చేశారు. అంతేకాదు.. తనను మోహన్ బాబు కొట్టడానికి వచ్చాడని… పచ్చి బూతులు తిట్టారని ఆరోపణలు చేశారు. ఇంత అవమానం తో ఎందుకు బతకాలి అనుకున్నానని.. మా ఫ్యామిలీ కూడా బాధ పడిందని చెప్పారు. మూడు రోజులుగా..మోహన్ బాబు భార్య కూడా ఫోన్ చేసి భాద పడిందని వెల్లడించారు బెనర్జీ. ఇప్పుడు రాజీనామా చేశాక.. ఆ బాధ కాస్త తగ్గిందన్నారు.