దేశీయ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం

దేశీయ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లు దేశీయ విమాన ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాలకు చెక్ పడనుంది. ఇంత కాలం దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే ప్రయాణిలకు కోవిడ్ ఆంక్షల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా డొమెస్టిక్ విమానాలపై పూర్తిస్థాయిలో ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈనెల 18 నుంచి పూర్తిస్థాయిలో దేశీయ విమానాలను ఆపరేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 100 శాతం ప్రయాణికుల సామర్థ్యంతో విమానాలను నడపనుంది.

 ప్రస్తుతం 85 శాతం కెపాసిటీతోనే దేశీయ విమానాలు నడుస్తున్నాయి. కరోనా ప్రారంభమైన తర్వాత నుంచి 2020 మే నుంచి దేశీయ విమానాలు తక్కువ సామర్థ్యంతోనే నడుస్తున్నాయి. తాజా కేంద్రం నిర్ణయంతో దేశీయంగా పలు రూట్లలో విమానాల సంఖ్య పెరగడంతో పాటు ప్రయాణికుల లోడ్ కూడా పెరుగనుంది. ప్రస్తుతం పండగ సీజన్లో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులకు ఊరట కలుగనుంది.