KGF-3 : మాస్ కాంబినేషన్.. బాల‌య్య‌తో ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్‌-3

-

రెండు చాప్ట‌ర్ల త‌రువాత కేజీఎఫ్
వ‌రుస సంచ‌నాల త‌రువాత కేజీఎఫ్
ఇప్పుడు ఆ బంగారు గనిలోకి బాల‌య్య వెళ్తున్నారు
ఇంకేం అంతా ఆనంద‌మే..ప‌ట్టిందంతా బంగార‌మే!
అనుకునేందుకు ఈ ఊహ ఎంత బాగుంది

క‌న్న‌డ చిత్ర సీమ‌ను ప్ర‌పంచం ముందు పెట్టిన సినిమా కేజీఎఫ్. 2018 లో వ‌చ్చిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా పెను సంచ‌ల‌నాల‌ను సృష్టించింది.ఈ సినిమాకు సీక్వెల్ గా ప్ర‌స్తుతం కేజీఎఫ్ – 2 తెర‌కెక్కుతుంది.రూ.100 కోట్ల కు పైగా భారీ బ‌డ్జెట్ తో కేజీఎఫ్ – 2 సినిమాను నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమాను వేసవి కానుక‌గా ఏప్రిల్ 14న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.ఈ సినిమా త‌ర్వాత డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ – 3 కోసం కథ సిద్ధం చేస్తున్నాడ‌ని గ‌త కొద్ది రోజుల నుంచి వినిపిస్తుంది.

అయితే ఈ కేజీఎఫ్ – 3 సినిమాలో హీరో ఎవ‌రు అనేది మాత్రం బ‌య‌ట‌కు రావ‌డం లేదు.ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక మాస్ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్ర‌శాంత్ నీల్ సిద్ధం చేస్తున్న కేజీఎఫ్ – 3లో హీరోగా నంద‌మూరి బాల‌కృష్ణ ను ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది అన్న‌ది ఓ వార్త. ఓ చ‌ర్చ కూడా ! బాల‌య్య అఖండ సినిమా ఇటీవ‌ల ప్ర‌పంచాన్నే షేక్ చేసిన విషయం తెలిసిందే.!

తెలుగు ప్రేక్షకులే కాకుండా..అమెరికా ప్రేక్షకులు కూడా అఖండ సినిమాను ఆద‌రించారు. కాగ ఈ మాస్ హీరోకు కేజీఎఫ్ వంటి మాస్ సినిమాలు సెట్ అవుతాయి.అందుకే కేజీఎఫ్ – 3ని బాల‌య్య‌తో చేయాల‌ని ప్ర‌శాంత్ నీల్ భావిస్తే ఎలా ఉంటుంది అన్న‌ది ఓ ఆసక్తి.దీని పై ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.కానీ త్వ‌ర‌లోనే ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ – 3పై ఓ స్ప‌ష్ట‌మ‌యిన ప్ర‌క‌ట‌న చేస్తే అందులో బాల‌య్య కూడా ఉంటే ఎంత బాగుంటుందో ! ఆ ఊహే అదుర్స్ క‌దూ!

Read more RELATED
Recommended to you

Latest news