కన్నడ నటుడు ఉపేంద్ర పై ప్రశంసలు కురిపించిన ప్రశాంత్ నీల్

-

KGF, సలార్ మూవీలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కన్నడ నటుడు ఉపేంద్రపై ప్రశంసలు కురిపించారు. ఆయన తన అభిమాన దర్శకుడని తెలిపారు. ‘ఉపేంద్రలా ఎవరూ సినిమాలు తీయలేరు. విభిన్నమైన కథలను తెరపై ఆయన ఆవిష్కరించే తీరు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ‘ఏ’, ‘ఓమ్’, ‘ష్..’, ‘ఉపేంద్ర’ సినిమాలు చూస్తే.. ఇలా తీసి కూడా హిట్ కొట్టొచ్చని నిరూపించారు’ అని అన్నారు.

ప్రస్తుతం ఉపేంద్ర డైరెక్షన్ లో వస్తున్న మరో వైవిధ్యమైన సినిమా ‘యూఐ’. యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ చిత్రం ఓ సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా లోని ‘చీప్’ సాంగ్ లిరికల్ వైరల్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్-2: శౌర్యంగ పర్వం’ కోసం సిద్ధమవుతున్నారు. ప్రభాస్ తో ఆయన తీసిన ‘సలార్’ ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news