ప్రముఖ అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ క్రిస్టియన్ డియోర్ సంస్థ ఇటీవలే భారత్లో సందడి చేసింది. తమ సంస్థకు సంబంధించిన ప్రీ-ఫాల్ 2023 అనే షోను నిర్వహించింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై రెడ్ కార్పెట్ పై సందడి చేశారు.
ప్రీ-ఫాల్ 2023 షో ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా వేదికగా జరిగగా పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు హాజరై కనువిందు చేశారు. అంతర్జాతీయ తారల సైతం హాజరైన ఈ కార్యక్రమంకి బాలీవుడ్ నటులు అనన్య పాండే, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, అతియా శెట్టి, సోనమ్ కపూర్, కరిష్మా కపూర్ వంటి వారంతా హాజరయ్యారు. అలాగే ఈషా అంబానీ, రాధిక మర్చంట్ ఈ షోలో పాల్గొని సందడి చేశారు.