పెరటి కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు..

-

కొందరికి కోళ్లను పెంచుకోవడం సరదా..ఇంట్లో పెరట్లో కోళ్లను పెంచుతారు.నాటుకోళ్లలో ఉత్పాదక శక్తి తక్కువ. పుంజులు 2.5-3.5కి, పెట్టలు 1.5 -1.8 కి. వరకు బరువు పెరుగుతాయి. సాలిన పెట్టలు 40-50 గుడ్లను మాత్రమే పెడతాయి. వీటిలో పొదిగే లక్షణం ఎక్కువ. కొక్కెర, మాశుచి వ్యాధులు సోకినప్పుడు 40-60 శాతం దాకా చనిపోతాయి. ఇంటి పరిసరాల్లోని, వంటింట్లోని ఆహార పదార్థాల్ని తిని పెరుగుతాయి. వీటి మాంసం, గుడ్లలో ఎలాంటి పురుగు మందుల అవశేషాలు ఉండవు. అందుకే వీటికి డిమాండ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నాటుకోళ్లను సంకరపరిచి పెరట్లో లాభసాటిగా పెంచుకునే కోళ్ల రకాలను అభివృద్ధి చేశారు.అవేంటో ఇప్పుడు చుద్దాము..+

రాజశ్రీ:- పశువైద్య కళాశాల తిరుపతి, రాజేంద్రనగర్ లో లభిస్తాయి. 160 రోజుల నుంచి గుడ్లు పెట్టడం, సాలిన 180 గుడ్లు పెడతాయి. గుడ్లు బరువు 53 గ్రా ఉంటాయి.

వనరాజు,గ్రామప్రియ, కృషిబ్రో:- ఈ మూడు రకాలు కోళ్లు హైదరాబాద్ లోని కోళ్ల ప్రాజెక్టులో లభిస్తాయి. వనరాజు కోళ్లు 130-150 రోజుల నుంచి గుడ్లు పెట్టడం మొదలెట్టి సాలిన 140-150 గుడ్లు పెడతాయి. గుడ్లు 55-63 గ్రా బరువుంటుంది. గ్రామప్రియ కోళ్లు 150 రోజుల వయసు నుంచి మొదలెట్టి సాలిన 160-180 గుడ్లు పెడతాయి. కృషిబ్రో రకం పెరట్లో పెంచటానికి అనువైన బ్రాయిలర్ కోడి రకం..

గిరిరాజు, స్వర్ణధార:- ఈ రెండు రకాల కోళ్లు కె. వి. ఎ., ఎఫ్. ఎస్. ఓ, బెంగళూర్ వారి వద్ద లభిస్తాయి. 150 రోజుల వయసు నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభించ సాలీన గిరిరాజు రకం 160-170 స్వర్ణధార రకం 180-190 గుడ్లు పెడతాయి. ఇజత్ నగర్ లోని సెంట్రల్ ఏవియేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు క్వారినిర్ బిక్, క్వారిశ్యాము, హిట్ క్వారి కోళ్ల రకాలను అభివృద్ధి చేశారు.

ఈ పెరటికోళ్లు ఎక్కువ బరువు తుగతాయి. ఆకర్షణియంగా ఉంటాయి. గుడ్లు ఉత్పత్తి, వ్యాధి నిరోధికశక్తి ఎక్కువ. సాలిన 160-180 గుడ్లు పెడతాయి. 3.5 నుంచి 4.5కిలోల బరువు తుగతాయి. ఐదు, ఐదున్నర మాసాల వయసు నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి.ఇవి పొదగవు..

వీటికి ఎక్కువగా వచ్చే వ్యాధులు..ఆరుబయట తిరిగే కోళ్లలో అంతర పరాన్నజీవుల నివారణకు ప్రతి 2 నెలలకోసారి డీవార్మింగ్ మందులు వాడాలి. ఒక రోజు వయసు కోడిపిల్లకు మెరెక్స్ టీకా, 7 వ రోజు ఆర్. డి. టీకాను వేయాలి. ప్రతికోడికి 3-4 గ్రా. చొప్పున సున్నపురాయి పొడి లేదా అల్చిప్పల పొడి అందిస్తే తగినంత కాల్షియం లభించడంతో తోలు గుడ్లు పెట్టవు..మరింత సమాచారం కోసం పశు వైద్యులను సంప్రదించాలి.

Read more RELATED
Recommended to you

Latest news