మామిడి కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

-

మన రాష్త్రంలో ఎక్కువగా పండించే పంటలలో మామిడి కూడా ఒకటి..సుమారు 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతున్నది..కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్‌, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు మరియు నల్లగొండ జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తున్నారు. మన దేశపు ఉత్పత్తిలో షుమారు 24 శాతం వాటా మన రాష్ట్రానిదే..

మామిడి కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కోసిన పంటను మొత్తాన్ని ఒక చోట నీడలో ఆరబోయాలి..దానిలో పిందెలు, వ్యాధి సోకిన మరియు కుళ్ళిన వాటిని వేరు చేయాలి. వేరు చేసిన తరువాత పండ్ల ఆకారం, పరిమాణం, రంగు, బరువును బట్టి యాంత్రికంగా గాని, మనుషుల చేతగాని వేరు చేయాలి.చాలా దేశాలు కొన్ని స్వంత స్టాండర్డ్ లను కలిగి ఉండి వాటిని బట్టి గ్రేడింగ్ చేసి లోకల్ మార్కెట్కు గాని విదేశీ మార్కెటికి గాని పంపించి అమ్మకం చేస్తారు..

గ్రేడింగ్ తరువాత పండ్లను ఆకులు, కొమ్మలు మొదలగు వాటిలో కప్పివేసి తూకం వేసి చిన్న చిన్నగా ప్యాక్ చేస్తారు. తరువాత ఈ చిన్న, చిన్న ప్యాకెట్లను పెద్ద గోనె సంచులో గాని, ఊలుతో తయారైన సంచిలలో గాని, వెదురు బుట్టలో గాని, గడ్డి బుట్ట, తాటిబుట్టలు, చెక్క పెట్టెలు, మట్టి కుండలు, ఫైబర్ కార్డ్ బోర్డలో, ప్లాస్టిక్ పెట్టెలలో గాని ప్యాకే చేయుదురు.

రవాణాను ఎన్నుకునే ముందు పంపించే నరుకు యొక్క నిలువ సామర్థ్యం మరియు పంపించే దూరంను దృష్టిలో ఉంచుకోవాలి. తొందరగా పాడయ్యే వాటిని పొలంలోని వేడిని తగ్గించుటకు ప్యాక్ చేయక ముందు కొద్దిగా చల్ల పరిచి రవాణా చేయాలి. దీనికి గాను రైలు రవాణా కంటె రోడ్డు రవాణా ఉత్తమం.లోకల్ మార్కెట్లకు ఎడ్లబండి, ట్రాక్టర్, ట్రక్కులు, ట్రాలీలు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించి సరుకుకు నష్టం కలగకుండా చూడాలి..

చివరికి నిల్వ చేయడం..పండ్లు కూరగాయల నిలువకు తక్కువ ఉష్ణోగ్రత మరియు ఎక్కువ తేమ 95% అవసరం. ఉల్లి మరియు వెల్లుల్లి తక్కువ తేమ 70% అవసరం అలుగడ్డ మరియు ఉల్లిగడ్డను వివిధ పద్దతులలో నిలువ చేస్తారు..పండ్లు నిల్వలో జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువగా కాలం నిల్వ ఉంటాయి..

Read more RELATED
Recommended to you

Latest news