సమంత తో రిలేషన్ పై ప్రీతమ్ జుకల్కర్ సంచలన పోస్ట్ !

అక్కినేని నాగచైతన్య మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో.. అక్కినేని ఫ్యామిలీ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ కు గురయ్యారు. అయితే.. విడాకుల ప్రకటన అనంతరం సమంతపై దారుణంగా ట్రోలింగ్ మొదలు పెట్టారు నెటిజన్లు. సమంత మరియు పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ మధ్య ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి.

అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా… వీరిద్దరి మధ్య బంధాన్ని హైలెట్ చేసింది. దీంతో స్వయంగా సమంతనే రంగంలోకి దిగి… ఆ రూమర్స్ పై కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని… అలాంటి వార్తలు ప్రచారం చేస్తే… తాను ఊరుకోనoటూ హెచ్చరించింది సమంత. ఇది ఇలా ఉండగా తాజాగా… సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్… ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. సమంత కు తనకు ఎలాంటి ఎఫైర్స్ లేవని పేర్కొన్నాడు ప్రీతమ్ జుకల్కర్.

సమంత మరియు తన మధ్య బంధం గురించి… అక్కినేని నాగ చైతన్య కు బాగా తెలుసు అని చెప్పిన ప్రీతమ్… సమంతను తాను ఎప్పుడూ సిస్టర్ అని పిలుస్తానని చెప్పుకొచ్చాడు. కానీ కొంతమంది కావాలనే తమ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు రాస్తున్నారని మండిపడ్డాడు ప్రీతమ్. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు. ఇక ప్రీతమ్ తాజా పోస్ట్ పై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.