విష్ణు పర్మిషన్ లేకుండా ఎవరూ మీడియా ముందుకు వెళ్లొద్దు :మోహన్ బాబు

మంచు విష్ణు గెలుపును ఎన్నికల అధికారులు ప్రకటించిన అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడి అనుమతి లేనిదే గెలిచిన సభ్యులు ఎవరు మీడియా ముందుకు వెళ్ళకూడదు అని మోహన్ బాబు అన్నారు. ఇది ఒకరి విజయం కాదని సభ్యులందరి విజయమని మోహన్ బాబు తెలిపారు. మా సభ్యులు అంతా మనవాళ్ళే అని… మీ అందరి ఆశీర్వాదంతో మంచు విష్ణు గెలిచాడని అన్నారు. ఇది ఆనందం అనుకుంటే కరెక్ట్ కాదని భయంకరమైన వాగ్దానాలు చేశాడని తెలిపారు. అవన్నీ నా బిడ్డ విజయానికి కారణమయ్యాయని చెప్పారు.

చెప్పింది చెప్పినట్టు అన్ని నెరవేరుస్తాడని మోహన్ బాబు హామీ ఇచ్చారు. జరిగింది జరిగిపోయిందని అందరం ఒక తల్లి బిడ్డల లాగా కలిసి ఉండాలని చెప్పారు. దాసరి నారాయణ రావు గారు ఎన్నికలు ఎప్పుడూ ఏకగ్రీవం కావాలని కోరుకునే వారని చెప్పారు. ఇకపై అలాగే జరిగేలా పెద్దలు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు జరిగినవి అన్నీ పక్కన పెట్టాలని… అటు పక్కన ఉన్న ఆడపడుచులు ఇంటి పక్కన ఉన్న ఆడపడుచులు అధ్యక్షుడి అనుమతి లేనిదే మీడియా ముందుకు వెళ్ళకూడదు అని చెప్పారు.