గర్భిణీలు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు: యూనియన్ హెల్త్ మినిస్టరీ..!

-

యూనియన్ హెల్త్ మినిస్టరీ శుక్రవారం నాడు గర్భిణీలు కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని చెప్పారు. యూనియన్ హెల్త్ మినిస్టరీ తరపున ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాలు చెప్పారు. ఇక వాటికి సంబంధించి పూర్తిగా చూస్తే..

మినిస్టరీ ఆఫ్ హెల్త్ వ్యాక్సిన్ కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. అయితే గర్భిణీలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని ఆయన అన్నారు. గర్భిణీలు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్ భార్గవ అన్నారు.

ఇదిలా ఉంటే పిల్లలకి వ్యాక్సిన్ త్వరలో వేస్తామని కానీ ఇంకా తేదీని ప్రకటించలేదని చెప్పారు. అయితే ఇప్పటికి కేవలం ఒకే ఒక్క దేశం పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తోందని కానీ ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది అని అన్నారు.

పిల్లలకి వ్యాక్సిన్ వేసే విషయంలో రీసెర్చ్ జరుగుతోందని.. డేటాని కలెక్ట్ చేస్తున్నట్లు చెప్పారు. రెండు నుంచి 18 ఏళ్ల పిల్లల్లో మేము స్టడీ మొదలు పెట్టమని.. వీటి తాలూకు ఫలితాలు సెప్టెంబర్ నెలలో వస్తాయి అని డాక్టర్ భార్గవ అన్నారు.

కాన్ఫరెన్స్ సమయంలో డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డాక్టర్ సింగ్ డెల్టా ప్లస్ వేరియంట్ కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. దేశంలో ఇప్పటికి 48 కేసులు నమోదయ్యాయని అన్నారు.

అయితే వీటిలో 50 శాతం కేసులు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ మరియు వెస్ట్ బెంగాల్ లో నమోదయినట్లు గుర్తించారు. యూనియన్ హెల్త్ మినిస్టరీ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ రికవరీ రేట్ పెరిగిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news