తిరుమల శ్రీవారి నిధులు దారిమళ్లుతున్నాయి!

-

తిరుమల: శ్రీవారి నిధులు దారిమళ్లుతున్నాయని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. శ్రీవారిని దర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా టీటీడీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆయన తెలిపారు. గరుడ వారధి నిర్మాణానికి శ్రీవారి నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. భక్తులు సమర్పించే నిధులు ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. గరుడ వారధిని అలిపిరి వరకు పొడిగిస్తే పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గరుడ వారధి పొడిగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే వున్న కళ్యాణమండపాలు ఖాళీగా ఉంటే తిరిగి కళ్యాణమండపాలు నిర్మించాలని పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ వెంటనే వెన్నకి తీసుకోవాలని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇక తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. తిరుమల శ్రీవారిని శుక్రవారం మొత్తం 12 వేల 685 మంది భక్తులు దర్శించుకున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.40 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. నిన్న స్వామివారికి 6 వేల 703 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news