బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ గురువారం ముంబై రిలయన్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం విషమించడం తో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకుని వెళ్ళినా సరే ప్రయోజనం లేకపోయింది. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించడం తో రిషీ కపూర్ నిన్న తుది శ్వాస విడిచారు. ఆయన లుకేమియా కారణంగా మరణించారు.
ఆయనకు 2018 లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. క్యాన్సర్ చికిత్స తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. అసలు లుకేమియా అంటే… ఈ వ్యాధి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి.
ల్యుకేమియా అనేది ఎముక మజ్జలో రక్తంతో కలిసి ఏర్పడే కణజాలాల క్యాన్సర్. మన శరీరం ఎంత బలంగా ఉన్నా సరే దీన్ని తట్టుకుని నిలబడటం చాలా కష్టం. మన శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడం వల్ల వస్తుంది. తెల్ల రక్త కణాలు అప్పుడు ఎర్ర రక్త కణాలు మరియు ప్లేట్‌లెట్లను బయటకు తీస్తూ ఉంటాయి.
లుకేమియా రకాలు చూస్తే…
అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, అక్యూట్ మైలోయిడ్ లుకేమియా మరియు క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా వంటి అనేక రకాల లుకేమియా క్యాన్సర్ లు ఉన్నాయి.
లక్షణాలు
నెమ్మదిగా లుకేమియా పెరుగుతుంది. చాలా మంది రోగులకు లక్షణాలు కనపడవు. అయినప్పటికీ, వేగంగా పెరుగుతున్న లుకేమియా ఉన్నవారికి అలసట, బరువు తగ్గడం, తరచూ అంటువ్యాధులు మరియు రక్తస్రావం లేదా గాయాలు వంటి లక్షణాలు ఉంటాయి.
రోగుల ఎముకలు లేదా కీళ్ళలో నొప్పి, మైకము, జ్వరం, ఆకలి లేకపోవడం, నోటి పుండు, చర్మంపై ఎర్రటి మచ్చలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, అనుకోకుండా బరువు తగ్గడం లేదా బలహీనత వంటివి కూడా అనుభవిస్తారు.