గర్భిణి స్త్రీలు గర్భం బయటపడిన రోజు నుంచి కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. లేకపోతే లోపల పెరిగే బిడ్డకు, వాళ్లకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్నో అలవాట్లను కూడా వాళ్ళు వదులుకోవాలి. మద్యం, పొగాకు ఉత్పత్తుల అలవాట్లకు దూరంగా ఉండటం అనేది చాలా వరకు ఉత్తమం అని వైద్యులు చెప్తూ ఉంటారు. ఇక కొన్ని రకాల వాసనలు కూడా వాళ్ళు పీల్చకూడదు.
ఇక ఇంట్లో ఉండే కొన్ని వాసనలు కూడా వాళ్ళు పీల్చకూడదు. దాని ద్వారా బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది అంటున్నారు వైద్యులు అవును అది అక్షరాలా నిజం అంటున్నారు.
వాల్ పెయింట్
ఈ వాసన పీలిస్తే పుట్టుకతో వచ్చే లోపాలు లేదా అకాల పుట్టుక యొక్క ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ద్రావకాలు లేదా స్ప్రేలు లేని ఉత్పత్తులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. గదిని బాగా వెంటిలేషన్ గా ఉంచే విధంగా చూడండి. అసలు వాల్ పెయింట్ కి దూరంగా ఉంటే చాలా మంచిది. దానిలో వాడే కొన్ని రసాయనాలు ఇబ్బంది పెట్టవచ్చు.
దోమల నివారణ స్ప్రేలు
దోమల నివారణ స్ప్రే లకు దూరంగా ఉండాలి. అవి శిశువుకు హానీ కరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దోమల నుంచి కాపాడినా సరే వాటిలో ఉండే ఇతర రసాయనాలు మీకు హాని కలిగిస్తాయి. ఇవి చర్మం ద్వారా లోపలి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
నాఫ్తలీన్ బాల్స్
సాధారణంగా నాఫ్తలీన్ బాల్స్ ఇళ్ళల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. కీటకాలు రాకుండా రక్షణ కోసం వాడుతూ ఉంటారు జనం. మనం వాడే మాత్ బాల్స్ 98% నాఫ్థలీన్ కలిగి ఉంటుంది, ఇది ఒక విష రసాయనం. దీని వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. వీటి వల్ల పిండంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అవి సరిగా నిల్వ చేయకపోతే, అది తీవ్రమైన సమస్యలను తెస్తుంది.