కేరళను నోరో వైరస్ వణికిస్తుంది. వయనాడ్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు బయటపడ్డాయి. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వైరస్ కేసుల గురించి కలవరం వ్యక్తం చేశారు. అయితే అసలు ఇది ఎలా వ్యాపింస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓసారి తెలుసుకుందాం..
- నోరో వైరస్ జీర్ణాశయం పై ప్రభావం చూపించే వైరస్ తరగతికి చెందినది. ఇది జీర్ణాశయం.. పేగుల లైనింగ్ దెబ్బతీసి వాపుకు కారణమవుతోంది. వాంతింగ్, విరేచనాలకు కారణం అవుతోంది.
- జంతువుల్లో ఉండే వ్యాధి.. ఆహారం, నీటి ద్వారా మనుషులకు సోకుతుంది.
- ఆరోగ్యవంతులపై పెద్దగా ప్రభావం చూపని వైరస్.. పిల్లలు, పెద్ద వయస్సు వారిపై ప్రభావం చూపిస్తుంది.
- నీటి ద్వారా వచ్చే అవకాశాలు ఉండటంతో, నీటిని క్లోరినేషన్ చేసిన తర్వాత తీసుకుంటే వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
- జంతువుల నుంచి సోకే ఈ వైరస్, డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది.
- వైరస్ బారిన పడిన వ్యక్తి వాంతులు, విరేచనాల వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి వైరస్ సోకిన వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.
- వైరస్ సోకిన రెండు రోజుల తర్వాత వ్యాధి తాలూకూ లక్షణాలు బయటపడే అవకాశం ఉంది.
- వైరస్ సోకిన వ్యక్తికి వాంతులు, విరేచనాలతో పాటు, జ్వరం, బాడీ పెయిన్స్, తలనొప్పి లక్షణాలు ఉంటాయి.
- వైరస్ సోకిన వ్యక్తి డాక్టర్ ను సంప్రదించాలి. ఇంటి వద్దే ఉంటూ విశ్రాంతి తీసుకోవాలి. ఓఆర్ఎస్ ద్రావణాన్ని, వేడి చేసిన నీటినే తాగాలి.
- వైరస్ సోకకుండా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఎవరైతే జంతువలకు దగ్గరగా ఉంటారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
- కూరగాయలు, పండ్లు పూర్తిగా శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలి.
- బయట ఆహారానికి దూరంగా ఉండాలి.
- చేపలు, రొయ్యలు, పీతలను బాగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి.