ఐదేళ్ళలో 10వేల ఉద్యోగ్యాలు లక్ష్యంగా ఇండియాలో పెట్టుబడి పెట్టనున్న బడా కంపెనీ.

-

ప్రైస్ వాటర్ కూపర్స్.. ప్రపంచంలో అగ్ర కంపెనీల్లో ఇదీ ఒకటి. పీడబ్ల్యూసీగా పిలవబడే ఈ కంపెనీ ఇండియాలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధం అవుతుంది. ఈ మేరకు బుధవారం ప్రకటించింది. 1600కోట్లతో ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ పెట్టుబడులతో ఐదేళ్ళలో 10వేల ఉద్యోగాలు రానున్నాయని చెబుతుంది. ఈ విషయమై కంపెనీకి చెందిన స్టాక్ హోల్డర్స్ సహా యాజమాన్యంతో చర్చలు జరిగాయని, కొత్త సమీకరణలను ఆహ్వానించే ఉద్దేశ్యంతో పెట్టుబడులు ఉంటాయని, ఇందుకోసం సరికొత్త విధానాలాను ఆవిష్కరించాలని, అందుకోసం ఇండియా అయితే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారట.పీడబ్ల్యూసీ,

ఇక్కడ అవలంబించబోయే సరికొత్త విధానాలు వినియోగదారులకి మరింత మేలు చేసే విధంగా ఉంటాయని కంపెనీ పేర్కొంది. మొత్తం 1600కోట్ల పెట్టుబడిని ఏయే రంగాల్లో పెట్టనున్నారో చెబుతూ, డిజిటల్, క్లౌడ్, సైబర్ ఇంకా సరికొత్త సాంకేతికలను అభివృద్ధి చేసేందుకు ముందుటామని తెలిపింది.

ప్రస్తుతం పీడబ్ల్యూసీ కంపెనీలో భారతదేశంలో 15వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మరో ఐదేళ్ళలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని, సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు చేపడుతున్నందున ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని, అదీగాక ఉద్యోగుల విషయంలో ఆడా, మగా అనే తేడా లేకుండా సమానత్వం ఉంటుందని వివరించింది. పీడబ్ల్యూసీ కంపెనీ ఉద్యోగుల నైపుణ్యాన్ని మరింత పెంచడానికి శిక్షణ ఇవ్వడంలో కంపెనీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. మొత్తానికి 1600కోట్లతో ఐదేళ్ళలో 10వేల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 2వేల మందికి ఉపాధి దొరుకుతుందని అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news