కరోనా పరిస్థితులపై మోదీ వర్చువల్ సమావేశం.. హాజరైన కిషన్ రెడ్డి

-

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతోంది. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో కరోనా కేసులు తీవ్రతరం అయ్యాయి. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్ గణాంకాలు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తాజా పరిస్థితులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తాజాగా ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులపై మోదీ వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత క్రీడాకారులతోనూ ప్రధాని మోడీ ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.. ఈ కాన్ఫరెన్స్‌ ద్వారా క్రీడాకారులకు మోదీ బెస్ట్ విషెస్ తెలపనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news