కచ్ తీరంలో.. సైనికులతో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం జవాన్లతో చేసుకున్నారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ప్రధాని మోడీ.. భద్రతా సిబ్బందికి మిఠాయిలు తినిపించి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఏడాది సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. సైనిక దళాలతో కాసేపు ముచ్చటించి.. వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో మోడీ తొలిసారి సియాచిన్ లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలలో పాల్గొన్నారు. 2022లో కార్గిల్ లో, గత ఏడాది చైనా సరిహద్దులోని లేప్చా ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఒక్కో ఏడాది ఒక్కో ప్రాంతంలో సైనిక శిబిరంలో వేడుకలు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news