పుతినుకు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ

-

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పుతిన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలుపుతూ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా బలోపేతం చేయడానికి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ వెల్లడించారు.

తాజాగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ 88శాతం ఓట్లతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా జరిగిన ఈ పోలింగ్లో అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు దాదాపు 88% ఓట్లు లభించాయి . 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టగా ఈ విషయం తేలినట్లు తెలుస్తోంది. 24 ఏళ్ల పాలనను మరో ఆరేళ్లు కొనసాగించాలని పుతిన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news