ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య చేరుకున్నారు. అయోధ్యలోని హనుమాన్ గర్హీ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో హనుమాన్ గర్హీ ఆలయ ప్రధాన పూజారి ప్రేమ దాస్ జీ మహారాజ్ స్పందించారు. అయోధ్యలో భూమిపూజకు రానున్న ప్రధాని మోదీని వెండి కిరీటంతో ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కిరీటంపై రాముని ఇమేజ్ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఆలయంలో మూడున్నర కింటాళ్ళ బరువున్న గంటను మోదీ మోగిస్తారని చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రార్థనల అనంతరం రాంలాలా స్థలానికి బయలుదేరి వెళ్తారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ రాక మాకెంతో గర్వకారణమని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య చేరుకోగానే ఆయనకు యుపి సిఎం యోగి ఆదిత్య నాథ్ ఘన స్వాగతం పలికారు. భద్రతా సిబ్బంది మినహా ఎవరిని అనుమతించడం లేదు.