శ్రీకాకుళం జిల్లాలో దళితునిపై దాడి ఘటన పై స్పందించిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేసారు. పలాస పోలీస్ స్టేషన్ ఎదుట దళితునిపై సిఐ దాడికి దిగడం బాధాకరమన్నారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానన్న ఆయన… బాధ్యులైన సిఐ వేణుగోపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని తగిన ఆదేశాలు ఇచ్చామని ఆయన వ్యాఖ్యలు చేసారు.
ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నామని పేర్కొన్నారు. దళితుల రక్షణకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. ఘటనకు సంబంధించి విచారణ నిర్వహించి, ప్రాథమిక నివేదిక అందజేయాలని విశాఖ రేంజ్ డీఐజీ, శ్రీకాకుళం ఎస్పీలకు తగిన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.