కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేయించుకున్న ప్రధాని మోడీ

Join Our Community
follow manalokam on social media

ఎయిమ్స్‌లో భారత్ బయోటెక్ కోవాక్సిన్ రెండవ డోస్ ను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఈ టీకాలు వేయించుకోవాలని ప్రధాని మరోసారి కోరారు. “మీరు వ్యాక్సిన్‌కు అర్హత కలిగి ఉంటే, వెంటనే మీ షాట్‌ పొందండి” అని టీకా వేయించుకున్న అనంతరం పిఎం కోరారు. టీకా కోసం cowin.gov.inలో నమోదు చేసుకోవాలని ప్రజలను కోరారు. మార్చి 1 న, సీనియర్ సిటిజన్లకు మరియు 45 ఏళ్లు పైబడిన వారికి టీకా డ్రైవ్ ప్రారంభించినప్పుడు, ప్రధాని మోడీ తన టీకా యొక్క మొదటి డోస్ టీకా వేయించుకున్నారు.

Prime Minister Narendra Modi takes the second dose of Covaxin on Thursday.

పుదుచ్చేరికి చెందిన సిస్టర్ పి నివేదా ఆయనకు మొదటి డోస్ ఇచ్చారు.  సుమారు 37 రోజుల వ్యవధి తరువాత టీకా యొక్క రెండవ డోస్ ను పీఎం మోడీ తీసుకున్నారు. మొదటి మోతాదు తరువాత రెండవ మోతాదు నాలుగు నుంచి ఎనిమిది వారాల్లోపు తీసుకోవలసి ఉంటుంది.   టీకా యొక్క రెండవ మోతాదు ఇచ్చేందుకు పంజాబ్ నర్సు నిషా శర్మతో పాటు పి నివేదా కూడా హాజరైనట్లు వార్తా సంస్థ ANI నివేదించింది.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...