Prince Trailer : ‘జాతిరత్నాలు’ ను మించిన కామెడీ.. హిట్ కొట్టేలా ఉన్నాడే

-

కోలీవుడ్ యాక్టర్ శివ కార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ప్రిన్స్. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఉక్రెయిన్ భామ మరీనా రాబోశప్క హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

ఫన్, సీరియస్ ట్రాక్ తో కులం, మతం కోసం ఇంకా కొట్టుకుంటున్నారు ఏంట్రా, మనందరికీ ఒకటే రక్తం రా అనే డైలాగ్స్ తో మొదలైన ట్రైలర్. శివ కార్తికేయన్ టీచర్ గా పని చేస్తున్న స్కూల్ లోనే హీరోయిన్ కూడా టీచర్ గా చేరుతుంది.

స్కూల్ జర్నీ టైం లో హీరోను ఇష్టపడుతుంది. అక్కడే అస్సలు సమస్య మొదలవుతుంది. ఒక ఇండియన్, ఒక బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించడానికి స్థానికంగా ఉండేవారు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరి ప్రేమ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ట్రైలర్ లో సస్పెన్స్ లో పెడుతూ, సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాడు అనుదీప్ కేవి.

Read more RELATED
Recommended to you

Latest news