నిర్మల్ లో బస్సు బోల్తా..30 మంది ప్రయాణికులు !

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. అతి వేగం, తాగి నడపటం ఇతర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లాలోని కొండాపూర్ బైపాస్ వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 30 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది.

ఇందులో 15 మంది సులభంగా గాయపడగా … మిగతా 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని… నిర్మల్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ బస్సు ప్రమాదం హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తుండగా చోటు చేసుకుంది.

ఈ ఘోర ప్రమాదం జరిగినప్పుడు… బస్సులో ఏకంగా 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నిర్మల్ గ్రామీణ ఎస్సై వినయ్ కుమార్… దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.