పులితో ప్రియా వారియర్ ఆటలు.. దానిపై ఎక్కి… మామూలుగా లేదుగా!

-

కన్ను కొట్టి ఓవర్ నైట్ లో ఫేమన్ అయిపోయింది. ఆమె ఎవరో మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది. ప్రియా వారియర్.. మలయాళంతోపాటు తెలుగులోనూ సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఆరేడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇక ఆమెనే ప్రియా ప్రకాశ్ వారియర్.

ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ.. పెద్దపులితో ఆటలు ఆడింది. ఏకంగా దానిపై ఎక్కి.. ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అంతకు ముందు పూల్ లో కేక పెట్టించే పోజులతో కుర్రాళ్లను రెచ్చగొట్టింది. ఆ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన ఈమె.. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో పుల్ బిజీగా మారిపోయింది. అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. షూటింగ్ లకు కాస్త విరామమిచ్చిన ఈ భామ.. ప్రస్తుతం బ్యాంకాక్ లో విహరిస్తోంది. అయితే ఇందులో భాగంగానే ఈ భామ పులితో ఉన్న ఓ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది.

పులి పడుకుని ఉంటే.. చేతితో దాన్ని నిమిరింది. దానిపై పడుకుని హల్చల్ చేసింది. షర్ట్ జిన్స్, యెల్లో టాప్ వేసుకున్న ప్రియా వారియర్.. పులితో గేమ్స్ ఆడింది. దానిపై పడుకుంది. ఆ తర్వాతో పులితో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ అయితే కన్నర్పకుండా అలానే చూస్తూనే ఉన్నారు.

ఇక ప్రియా సినిమాల విషయానికొస్తే.. తొలి సినిమా ఒరు అదార్ లవ్. ఇందులో ఈమె హీరోయిన్ కాకపోయినప్పటికీ ఫేమ్ మాత్రం తెగ సంపాదించింది. ఆ తర్వాత తెలుగులోనూ ఛాన్సులు దక్కించుకున్న ఈమె.. నితిన్ ‘చెక్’, తేజ సజ్జా ‘ఇష్క్’ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో ‘శ్రీదేవి బంగ్లా’, 3 మంకీస్, లవ్ హ్యాకర్స్ చిత్రాలు చేస్తోంది. ఈ మూడు కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news