Priyamani: లాంగ్ ఫ్రాక్‌లో హీరోయిన్..వన్నె తగ్గని అందంతో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి

-

తన ఒంపు సొంపులతో కుర్రకారును ఫిదా చేస్తుంటుంది ‘ఢీ’ భామ ప్రియమణి. సోషల్ మీడియాలో తరచూ తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని పంచుకుంటుంది. తాజాగా ఈ సుందరి ఇన్ స్టా గ్రామ్ వేదికగా నీలి రంగు స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ ఫొటోలు షేర్ చేసింది. అవి సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

‘‘లవ్ మీ ఆర్ హేట్ మీ ఐదర్ వే ఐ యాం గోయింగ్ టు షైన్’’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఫొటోలు పోస్టు చేసింది. ఇక ఈ ఫొటలో చూసి నెటిజన్లు ‘‘ఆసం, కీప్ షైనింగ్’’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ కన్నడ భామ, గతేడాది శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘నారప్ప’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ‘సుందరమ్మ’గా డీ గ్లామర్ రోల్ ప్లే చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.

ఇటీవల విడుదలైన ‘భామాకలాపం’ సినిమాలోనూ ప్రియమణి ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘విరాట పర్వం’ లో ప్రియమణి ‘కామ్రేడ్ భారతక్క’గా నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రజెంట్ ఓ వైపు బుల్లితెరపైన ‘ఢీ’షోలో సందడి చేస్తూనే..మరో వైపున ‘పప్ప, మైదాన్’ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.

https://www.instagram.com/p/CdH2QRJpU0Z/

Read more RELATED
Recommended to you

Latest news