Priyanka Singh : బిగ్​బాస్ పింకీ హాట్ ట్రీట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

-

ప్రియాంక సింగ్‌ అంటే చాలా మంది గుర్తుపట్టరు కానీ. బిగ్​బాస్ పింకీ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ బ్యూటీ తెలుగు బిగ్​బాస్ షోలో కంటెస్టెంట్​గా వచ్చి పాపులారిటీ తెచ్చుకుంది. ఆ షోలోనే ఈ భామ తన అందచందాలతో ఆకట్టుకుంది.

ఇక పింకీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. బోల్డ్ ఔట్​ఫిట్స్​లో ఘాటు పోజులిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా పింకీ చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది. స్కిన్ కలర్ ఔట్​ఫిట్​లో ఒంటిపై డ్రెస్ ఉందా లేదా అన్నట్లు ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ఈ ఫొటోలు చూసిన కొందరు కుర్రాళ్లు పింకీ గ్లామర్ ట్రీట్​కు ఫిదా అవుతుంటే.. మరికొందరు మాత్రం ఏంటి పింకీ ఇలా తయారయ్యావు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా ఈ ఫొటోలు షేర్ చేస్తూ పింకీ..”నేను యాటిట్యూడ్‌తో పుట్టలేదు.. కానీ నాకు మంచి యాటిట్యూడ్ ఉంది. నా జీవితంలో ఎదగడానికి అది బాగా ఉపయోగపడింది. కొన్నిసార్లు నా కళ్లు కూడా మాట్లాడతాయి. ఇది నా జీవిత గమనాన్ని చెబుతుంది” అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే ఈ ఫొటోస్​ చూసిన నెటిజన్స్​ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మిక్స్​డ్​ కామెంట్స్​ చేస్తున్నారు. కొందరు విమర్శిస్తుండగా.. మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news