లాక్ డౌన్ కారణంగా భారీగా వాహనాల సేల్స్ పడిపోయిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తం గానే కాదు ప్రపంచ వ్యాప్త౦గా ఆటో మొబైల్ రంగం తీవ్రంగా ఇబ్బంది పడుతూ వస్తుంది. ఈ తరుణంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి గానూ భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ హ్యుందాయ్, టాటా కార్ల ఆన్‌లైన్ అమ్మకాలపై డిస్కౌంట్ వర్షం కురిపిస్తున్నాయి. టాటా మోటార్స్ ఇటీవల… ‘క్లిక్ టు డ్రైవ్’ డిజిటల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ను ఓపెన్ చేసింది.
ఈ సమయంలో టాటా కార్ల అమ్మకాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకమైన ఆఫర్లను భారీగా ప్రచారం చేస్తుంది. టాటా హారియర్ బిఎస్ 6 ను గత నెలలో మన దేశంలో లాంచ్ చేసింది సంస్థ. ఇప్పుడు టాటా హారియర్ కొనాలని చూస్తున్న ఎవరైనా టాటా ‘క్లిక్ టు డ్రైవ్’ ప్లాట్‌ఫామ్ ఉపయోగించి 30వేలరూపాయల తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా టాటా టైగర్‌పై 25వేల రూపాయల వరకు తగ్గుతుంది.
టాటా టియాగో హ్యాచ్ బ్యాక్‌ను టాటా ‘క్లిక్ టు డ్రైవ్’ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో 20వేల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. టాటామోటార్స్ లాగే హ్యుందాయ్ కూడా ‘క్లిక్ టు బై’ ఫ్లాట్ ఫాం ద్వార కార్లను ఆన్ లైన్ లో విక్రయించాలని నిర్ణయం తీసుకోవాలనుకుంది. హ్యుందాయ్ సాంట్రో కారును రూ.40వేల డిస్కౌంటుతో హ్యుందాయ్ అందుబాటులో ఉంచింది. గ్రాండ్ ఐ 10 కారుపై రూ.45వేలు, ఎలైట్ ఐ20 కారుపై రూ.35వేలు తగ్గించింది.