నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు నిరసన సెగ తగిలింది. బాండ్ పేపర్ ప్లకార్డ్స్ చూపిస్తూ గో బ్యాక్ నినాదాలు చేశారు టీఆర్ ఎస్ నేతలు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఎంపీ అరవింద్ ఇవాళ ఇందల్వాయ్‌లో పర్యటించారు. గన్నరం గ్రామం లో వైకుంఠ ధామం ,పల్లె ప్రకృతి వణం ప్రారంభోత్సవాలకు వెళ్లారు అరవింద్. అయితే.. ఎంపీ అరవింద్ వచ్చే కంటే ముందే కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవాలు నిర్వహించారు టీఆర్ఎస్ నేతలు.
దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. అటు పసుపు బోర్డు ఏమైందంటూ టీఆరెస్ కార్యకర్తల నినాదాలు చేశారు. బాండ్ పేపర్ ప్లకార్డ్స్ చూపిస్తూ అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు నేతలు. ఎమ్మెల్యే లేని సమయంలో ఎంపీ అరవింద్ రావడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ ఎస్ నేతలు.. నిరసన తో బిజెపి టీఆరెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం పెరిగింది. బిజెపి, టీఆరెస్ కార్యకర్తల మధ్య తోపులాట,రాళ్లదాడి చోటు చేసుకుంది. దీంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. అనంతరం స్వల్ప లాఠీఛార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు పోలీసులు.