బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష వేదిక మార్పు… పర్మిషన్ రాకపోవడంతోనే…

-

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్షకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. రేపటి నుంచి ఇందిరా పార్క్ వద్ద బండి సంజయ్ నిరుద్యోగ దీక్షను తలపెట్టాడు. అయితే ఓమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో తెలంగాన ప్రభుత్వం బహిరంగ సభలు, ర్యాలీలను జనవరి 2 వరకు నిషేధించింది. హై కోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఇయర్ వేడుకలతో పాటు, సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధించింది. దీంతో బండి సంజయ్ దీక్షకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు.

దీంతో ఇప్పటికే బీజేపీ పలుమార్లు నిరుద్యోగ దీక్ష అనుమతి కోసం డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాసింది. అయితే పోలీసుల నుంచి దాదాపుగా అనుమతి వచ్చేది లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చి ఉత్తర్వుల కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవచ్చు. అయితే బీజేపీ నిరుద్యోగ దీక్షా స్థలాన్ని ఇందిరా పార్క్ నుంచి బీజేపీ కార్యాలయానికి మార్చనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే బండి సంజయ్ నిరుద్యోగ దీక్షపై టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని సంజయ్ ని ప్రశ్నించారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ విఫలమైందన్నారు. కేంద్రం ఇచ్చిన ఉద్యోగాలతో తెలంగాణలోని యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news