అమ్మాయిల లిప్స్ ఆకారంలో ఉండే పూలు.. అక్కడే అవే ప్రత్యేకం..!

-

సాధారణంగా ఏ పూలు అయినా.. గుండ్రంగానే ఉంటాయి…కానీ అమ్మాయి ముద్దు పెట్టినట్లు ఉండే పూలను మీరు ఎప్పుడైనా చూశారా.. ఎర్రటి పేదాలు ముద్దు పెడితే.. ఎలా ఉంటుందో..ఆ ఆకారంలో.. పూలు ఉంటాయి. పాలికోరియా ఎలాటా లేదా సైకోట్రియా ఎలాటా అని పిలుస్తారు. ఈరోజు మనం ఈ పూల స్పెషల్ ఏంటో పూర్తిగా చూద్దాం..

ఈ ఎర్రటి పెదవుల పూలకు జీవితకాలం చాలా తక్కువే. ఈ పెదవుల మధ్యలోంచీ తెల్లటి పూలు వస్తాయి. అవి వచ్చాక… పెదవులు రాలిపోతాయి. ఆ తర్వాత కోడిగుడ్డు ఆకారంలోని బెర్రీస్ కాస్తాయి. అవి మొదట గ్రీన్ కలర్‌లో తర్వాత బ్లూ లేదా బ్లాక్ కలర్ లోకి మారతాయి. హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ (Angelina Jolie) పెదవులు ఇలాగే ఉంటాయని చాలా మంది అంటుంటారు.

ఈ సైకోట్రియా మొక్కల్లో 2000 రకాల జాతులున్నాయి. ఇవన్నీ పూల మొక్కలే. ఈ తరహా మొక్కలు మత్తు కలిగించే రసాయనాల్ని ఉత్పత్తి చేస్తాయి. డైమెతిల్‌ట్రిప్టామైన్ (dimethyltryptamine) అనే రసాయనాన్ని ఇవి విడుదల చేస్తాయి. ఈ కెమికల్‌ని అమెరికా, యూరప్ దేశాల్లో దైవ సంబంధ కార్యక్రమాలకూ, మందుల తయారీలో వాడుతారు.

ప్రేమికుల రోజున మధ్య అమెరికా ప్రజలు పూలతో ఉన్న ఈ మొక్కలను గిఫ్టుగా ఇస్తారు. తద్వారా తమ ప్రేమను తెలుపుతారు. ఈ మొక్కల ఆకులు, బెరడును గుజ్జుగా చేసి చర్మానికి రాసుకుంటే… దద్దుర్లు తగ్గుతాయి. దగ్గు, ఆస్తమా వంటి వాటికి కూడా ఇది పనిచేస్తుందట.

ఈ పూల మొక్కలు ఎక్కడబడితే అక్కడ పెరగవు. వీటికి కచ్చితమైన వాతావరణం అవసరం. ఎక్కువ వేడి ఉండకూడదు.. అలా అని బాగా కూల్ గా కూడా ఉండకూడదు.. కొంత వెచ్చగా, కొంత ఉక్కగా, కొంత తేమతో కూడిన వాతావరణం ఉండాలి. నీడలో ఇవి బాగా పెరుగుతాయి. ఎండలో అయితే ఊరికే.. ఈ మొక్కలు దెబ్బతింటాయి. ఈ మొక్కలు ఎక్కువగా దక్షిణ అమెరికా వర్షాధారిత అమెజాన్ అడవుల్లో పెరుగుతాయి. ఈక్వెడార్, కోస్టారికా, పనామా, కొలంబియాలో వాతావరణం వీటికి సెట్ అవుతుంది.

ప్రస్తుతం ఈ రకమైన మొక్కలు తగ్గిపోతున్నాయి.. అరుదైన మొక్కల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news