పబ్జీ ప్లేయర్స్ కి గుడ్ న్యూస్ !

-

వినియోగదారుల డేటాని వేరే దేశాలకి పంపుతూ జాతీయ భద్రతకు సంబంధించిన ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయనే కారణంగా PUBG మొబైల్‌ గేమ్ తో పాటు 117 ఇతర చైనీస్ యాప్‌ లను భారత ప్రభుత్వం ఇటీవల దేశంలో నిషేధించిందన్న సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుండి PUBG మొబైల్ యొక్క మాతృ సంస్థ PUBG కార్పొరేషన్ భారతదేశంలో ఈ గేమ్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి గాను అంతకు ముందు ఒప్పందం చేసుకున్న టెన్సెంట్ గేమ్స్ సంస్థతో తమ సంబంధాలను తెంచుకుంది. కాని భారత్ లోకి లీగల్ గా మళ్ళీ ఎంట్రీ అయితే ఇవ్వలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం భారతదేశంలో ఈ గేమ్ ని మళ్ళీ అఫీషియల్ గా లాంచ్ చేయడానికి PUBG కార్పొరేషన్ ఎయిర్టెల్ కంపెనీతో చర్చలు జరుపుతోంది. ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో తన ప్రసిద్ధ మొబైల్ గేమ్ ని లాంచ్ చేసి దానిని నిర్వహించడానికి PUBG కార్పొరేషన్ ఎయిర్టెల్ తో ఈ ముందస్తు చర్చలు జరుపుతోంది. అలానే PUBG కార్పొరేషన్ సంస్థ దేశంలో ఒక టీమ్ ని కూడా రెడీ చేస్తోంది, దానికి కాను 4 నుంచి 6 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ కూడా చేస్తోందట. PUBG కార్పొరేషన్ లేదా ఎయిర్టెల్ కానీ ఈ గేమ్ ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి చర్చలు జరుపుతున్నట్లు అధికారికంగా ధృవీకరించనందున నిజంగా ఎప్పటికి జరుగుతుందనేది చెప్పలేం.

Read more RELATED
Recommended to you

Latest news