బ్రేకింగ్ : రఘురామ కృష్ణం రాజు మీద సీబీఐ దాడులు.. జగన్ కి తెలిసే ?

-

జగన్ కి తెలిసే ఎంపీ రఘురామ కృష్ణం రాజు మీద సీబీఐ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఎంపీ రఘురామకృష్ణ రాజు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసారని ఏపీ సీఎంకు ముందే బాంక్ అధికారులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సీఎం ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆక్టోబర్ 6న సీఎం అధికారిక నివాసం 1 జన్ పథ్ లో ముఖ్యమంత్రి జగన్ ను పంజాబ్ నేషనల్ బాంక్ సీఈఓ,ఎండి మల్లికార్జున రావు, చీఫ్ జనరల్ మేనేజర్ ఖురానాలు కలిసినట్టు తెలుస్తోంది.

అదే రోజున రఘురామకృష్ణ రాజు కంపెనీ ఇంద్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. 826.17 కోట్ల ఋణం తీసుకుని సదరు కంపెనీ మోసానికి పాల్పడినట్లు సీబీఐకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. నిధులు దారి మళ్లించి దుర్వినియోగానికి పాల్పడైనట్లు కంపెనీ డైరెక్టర్లపై సిబిఐ కేసు నమోదు చేసింది. అంతే కాక కంపెనీ కార్యాలయాలు,యజమాని నివాసాలు సహా ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతాయని సిబిఐ అధికారికంగా ఈ మధ్యాహ్నం ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news