ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ అన్నాక ఇంటర్నెట్ ఉండాల్సిందే. జియో వచ్చిన తర్వాత ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఐతే ప్రస్తుతం ఇంటర్నెట్ ఛార్జీలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ ధరలు 30నుండి 40శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత అది లేకుండా రోజు గడవకుండా అయిపోయింది. అందువల్ల ప్రభుత్వం ఇంటర్నెట్ పై దృష్టి పెట్టింది.
భారత దేశ బ్రాడ్ బ్రాండ్ అధ్యక్షుడు టీవీ రామ చంద్రన్ ప్రకారం, పీఎమ్ వాణీ వచ్చేస్తోందని సమాచారం. పీఎమ్ వాణీ అనగా(). దీని ప్రకారం చాలామందికి ఉద్యోగాలు రావడంతో పాటు ప్రతీ ఒక్కరికీ తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది. ఇప్పుడున్న మొబైల్ రేట్ల కంటే చాలా చవకగా అందుబాటులోకి రానుందట. గత కొన్ని రోజులుగా దీనిపై పనులు సాగుతున్నాయట. సామాన్యులకి కూడా ఇంటర్నెట్ సేవలు అందించాలన్న లక్ష్యంతోనే పీఎమ్ వాణీ మొదలయ్యిందట.
పబ్లిక్ వైఫై మాడల్ ని యూనియన్ కేబినెట్ మినిస్టర్ అధికారికంగా ధృవీకరించింది కూడా. ప్రభుత్వం చెప్పిన్ దాని ప్రకారం, బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీకి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదట. సులువుగా ఒకచోటి నుండి మరోచోటుకి మార్చుకునేందుకు వీలుగా ఉండడంతో పాటు, యూసర్ ఫ్రెండ్లీగా వైఫై ఏర్పాట్లు జరగనున్నాయట.
ప్రస్తుతం 4జీ సేవలు లేని ప్రాంతాల్లో కూడా పబ్లిక్ వైఫై ఏర్పాటు చేసి అక్కడి వాళ్ళు దాని ద్వారా లాభం పొందేలా చేయాలని భావిస్తున్నారట. 2022 వరకు కోటి పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ కేంద్రాలని ఏర్పాటు చేస్తారట. ప్రస్తుతం కేవలం 3.5లక్షలు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల లక్షల సంఖ్యలో ఉపాధి పొందేవారున్నారట. మొత్తం 2కోట్ల మందికిపైగా ఉపాధి పొందే అవకాశాలున్నాయని తెలుస్తుంది. పబ్లిక్ వైఫై కి కావాల్సిన వస్తువులు, మొదలగు వాటివల్ల ఎక్కువ సంఖ్యలో నిరోద్యోగులకి ఉద్యోగాలు లభిస్తాయి.