దుబ్బాకలో తెరాసకు రెండు ప్లస్ లు.. అవే మైనస్ లు!

-

ప్రస్తుతం తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నిక మిగిలిన పార్టీలకు ఎంత కీలకం అన్నసంగతి కాసేపు పక్కనపెడితే… అధికారపార్టీకి మాత్రం అత్యంత కీలకం. ఇంకా గట్టిగా చెప్పాలంటే త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరబాద్ ఎన్నికలకు, తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా ఈ ఎన్నిక ఫలితాలు కీలకం అంటే అతిశయోక్తి కాదేమో!

అవును… ప్రస్తుతం తెలంగాణలో టి.ఆర్.ఎస్. కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ప్రజల్లో వ్యతిరేకత ఉందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి! ఈ క్రమంలో తెరాసపై ఉన్న వ్యతిరేకతను బలంగా ఉపయోగించుకుంటూ… ఎట్టిపరిస్థితుల్లోనూ తెరాసను ఈ ఉప ఎన్నికలో ఓడించాలనే గట్టిపట్టుదలతో ఉన్నాయి బీజేపీ – కాంగ్రెస్ లు! ఇక్కడ తెరాసకు రెండు ప్లస్ లు ఉండగా.. అవే రెండూ మైనస్ లుగా కూడా మారే ఛాన్స్ ఉంది!

తెరాస ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ – పైగా సానుభూతి ఓట్లు పడే ఛాన్స్ ఉంది! ఈ రెండు అంశాలు ఎన్నికలో పాల్గొనడానికి ప్లస్ అనుకుంటే… సపోజ్ ఫర్ సపోజ్ ఈ ఎన్నికలో తెరాస ఓడిపోతే మాత్రం… ఈ రెండు ప్లస్ లే మైనస్ లుగా మారబోతున్నాయి!! అవును… ఈ ఎన్నికల్లో సానుభూతి ఓట్లు ఉన్నప్పటికీ తెరాస ఓడిపోతే పార్టీకి చాలా దెబ్బే!

ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు రెండుగా చీలుతున్నప్పటికీ కాంగ్రెస్ నెగ్గుకురాగలిగితే అంతకుమించిన మైనస్ అధికారపక్షానికి మరొకటి ఉండదు! సో… దుబ్బాక నియోజకవర్గం చేతిలోనే తెరాస ఫ్యూచర్ ఉందనేది విశ్లేషకులు చెబుతున్న మాట! అందుకే ఈ ఎన్నికలు మిగిలినవారికంటే తెరాసకు అత్యంత కీలకంగా మారబోతున్నాయి!! ఈ విషయం అధికారపార్టీకి కూడా ఎరుకే కాబట్టి… వీలైనంతగా అన్ని శక్తులనూ ప్రయోగించాలని చూస్తుందంట!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news