Aman Dhaliwal : ఖలేజా నటుడిపై అమెరికాలో కత్తితో దాడి

-

ప్రముఖ పంజాబీ నటుడు అమన్‌ ధలివాల్‌ దాడికి గురయ్యాడు. అమన్​పై అమెరికాలో గుర్తు తెలియని కత్తితో దాడికి పాల్పడ్డాడు. కాలిఫోర్నియాలోని ప్లానెట్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌లో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్సర్సైజ్ చేసేందుకు వెళ్లిన ధలివాల్‌పై నిందితుడు దాడికి దిగడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం తీవ్ర గాయాలపాలైన ఆయనను జిమ్‌ సిబ్బంది దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

నిందితుడు ఎందుకు దాడి చేశాడన్న విషయంపై స్పష్టత లేదు. శరీరమంతా కట్లతో ఉన్న ధలివాల్‌ చిత్రంతోపాటు దాడికి పాల్పడిన సమయంలో వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ధలివాల్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయమై కుటుంబ సభ్యులుగానీ, వైద్యులుగానీ స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు.

అమన్‌ ధలివాల్‌ పంజాబీ, హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటించాడు. హృతిక్‌ రోషన్‌, ఐశ్వర్య రాయ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జోదా అక్బర్‌ సినిమాలో రాజ్‌కుమార్‌ రతన్‌ సింగ్‌ పాత్ర పోషించారు. ఖలేజా, విస్రా, ఇక్‌ కుడి పంజాబ్‌ డి, జాట్‌ బాయ్స్‌ పూత్‌ జట్టన్‌ డి, అనంత్‌ ది ఎండ్‌ తదితర చిత్రాల్లో నటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news