కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి తీపికబురు..!

-

కేంద్రం ఉద్యోగాలకి గుడ్ న్యూస్ చెప్పనుంది. దేశంలోని కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు ఎప్పటి నుండి డీఏ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆయా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్. డియర్‌నెస్ అలవెన్స్ మరియు డియర్‌నెస్ రిలీఫ్ పెంపు కోసం వారు పడే నిరీక్షణ శుక్రవారం వరకే.

ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… మార్చి 17న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం లో కేబినెట్‌ సమావేశం ఉంటుంది. దీని తరువాత కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు కి పెన్షనర్లకు గుడ్ న్యూస్ ని చెప్పనుంది. ద్రవ్యోల్బణం పెంపును ఈ రోజున ప్రకటించవచ్చు. అయితే మొన్నా మధ్య
మార్చి 15న డీఏ పెంపుదల ప్రకటించవచ్చని అనుకున్నారు కానీ అలా అవ్వలేదు.

మార్చి 17న డియర్‌నెస్ అలవెన్స్ పెంపు ఉంటుంది అని అంటున్నారు. మార్చి 1న కేబినెట్‌ సమావేశంలో దీని మీద అంగీకారం అయ్యింది కానీ ఏమి ప్రకటించ లేదు. 7వ వేతన సంఘం సమాచారం ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ డియర్‌నెస్ రిలీఫ్‌ను 4 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో అది 42 శాతానికి పెరుగుతుంది. ఒకవేళ కనుక ఇది పెరిగితే దాదాపు 47 లక్షల మంది ఉద్యోగులుకి, 68 లక్షల మంది పెన్షనర్లుకి ప్రయోజనం కలగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news