ఈసారి ఐపీఎల్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్‌కు..ఎట్టకేలకు ఓ గెలుపు దక్కింది. బెంగళూరుతో గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో.. కింగ్స్ ఎలెవన్ చివరి బంతికి విజయం సాధించి ఈ సీజన్‌లో రెండో విక్టరీని నమోదు చేసింది.
బెంగళూరు నిర్దేశించిన 172పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది కింగ్స్ ఎలెవన్ . తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్20ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 171పరుగులు చేసింది. లక్ష్యసాధనలో బరికిలోకి దిగిని పంజాబ్ జట్టు 61పరుగులతో కేఎల్ రాహుల్.. 53రన్స్‌తో క్రిస్‌గేల్ మెరవడంతో పంజాబ్‌ను ఎట్టకేలకు విజయం వరించింది..అయితే, వీరిద్దరి మెరుపులు చేసి పంజాబ్ సునాయసంగా గెలుస్తుందనుకునే అంచనాలు ఏర్పడిన వేళ.. చివరి ఓవర్‌లో ఉత్కంఠ ఏర్పడింది.
ఆరు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా ఇంకో రెండు బాల్స్‌లో పంజాబ్ విక్టరీ ఖాయం అనుకున్నారంతా. కానీ చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. చివరి బంతి వరకూ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. తొలి రెండు బంతులు డాట్ బాల్స్ కాగా.. మూడో బంతికి గేల్ సింగిల్ తీశాడు. నాలుగో బాల్ డాట్ కాగా.. ఐదో బంతికి గేల్ రనౌటయ్యాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే, గేల్ ప్లేస్‌లో వచ్చిన పూరన్.. చివరి బంతికి సిక్సర్ కొట్టి.. పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచాడు. 45 రన్స్ కొట్టిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. పంజాబ్‌కు మంచి ఆరంభాన్నిచ్చాడు.