చంద్రబాబు కంటతడిపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు…దిగజారిపోయారు !

-

చంద్రబాబు కంటతడిపై మరోసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి కామెంట్‌ చేశారు. అసెంబ్లీ అనేది చట్టాలు చేసే పవిత్రమైన స్థలం అని… అసెంబ్లీలో భాష ఏ మేరకు దిగజారిందో ప్రజలంతా చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు. సభలో భిన్నమైన వాతావరణం ఉంది.. ప్రజా సమస్యలపై కాకుండా వేరే రకమైన చర్చ జరుగుతోంది.. ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు.

వరద వచ్చిన తర్వాత నష్టం పై కేంద్రానికి సీఎం నివేదికవ్వాలని… కానీ ప్రధాని మోడీనే సిఎం జగనుకు ఫోన్ చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని… విభజన చట్డంలోని 90 శాతం అంశాలు పూర్తయ్యాయని వెల్లడించారు.

ఎవరూ ఊహించని విధంగా కేంద్రం ఏపీకి అనేక విధాలుగా సహకరిస్తుందని… ఏపీకి నిధులిచ్చే విషయంలో కేంద్రం ఎక్కడా మడప తిప్పలేదని స్పష్టం చేశారు. ఏపీ ఆర్ధిక స్ధితి సరిగా లేకపోతే కేంద్రమే నిధులిచ్చిందని… కేంద్రం నిధుల వల్లే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. అమరావతికి కట్టుబడి ఉన్నామని గతంలోనే ప్రకటించాం.. ఇప్పుడు ప్రత్యక్షంగా పాల్గొంటున్నామన్నారు. రైతులపై దాడులు సరికాదన్నారు పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news