రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తరుపున రూ.3 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. అయితే తాజాగా తెలంగాణ అమరవీరుల విషయం తెరపైకి వచ్చింది. టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దీనిపై కామెంట్స్ చేశాడు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించాడు.
ఆదివారం మీడియా మీట్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మరణించిన అమరవీరుల కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం టీఆర్ఎస్ పాలనలో 7,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని మరణించారని, ఇప్పటికీ ఆ బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని విమర్శించారు. హైదరాబాద్ కురిసి వర్షాల్లో వరద బాధితులకు కూడా పరిహారం ఇస్తామని తెలిపినా.. ఇప్పటికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. పంజాబ్‌లో చనిపోయిన రైతుల కుటుంబాలకు..రూ.3 లక్షలు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణలో మరణించినవారికి ఇవ్వలేదు.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ను ఎలా నమ్మేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.