స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప.. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. అన్ని భాషలలో కలుపుకొని ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. ముఖ్యంగా హిందీలో అయితే ఈ చిత్రం కేవలం కోటి 75 లక్షల రూపాయల నెట్ వసూళ్లతో ప్రారంభమై రూ.120 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసింది ఈ సినిమా అలాంటి సంచలనాలు సృష్టించిన చిత్రానికి సీక్వెల్ అంటే కచ్చితంగా అంచనాలు ఎవరు ఊహించని స్థాయిలో ఉంటాయి.
అయితే అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ సుకుమార్ కూడా ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న సినిమాకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇదిలో ఉండగా అప్పుడే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ కోసం బయ్యర్లు ఎగబడుతున్నారు. ఒక ప్రముఖ సంస్థ ఈ సినిమాకి అన్ని ప్రాంతీయ భాషలకు సంబంధించి 1000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తామని పుష్ప మేకర్స్ కి ఆఫర్ ఇచ్చిందట. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారింది . ఇప్పటివరకు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హిస్టరీలో రూ. 1000 కోట్ల రూపాయల మార్క్ అందుకున్న సినిమాలు దంగల్, బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ ఆర్ ఆర్ మరియు పఠాన్ మాత్రమే.
ఆ చిత్రాలు 1000 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేస్తేనే అబ్బో అని అనుకున్నారు అయితే ఇప్పుడు పుష్ప చిత్రం ఫ్రీ రిలీజ్ బిజినెస్ దగ్గరే 1000 కోట్ల రూపాయల డిమాండ్ పలకడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది . మరి విడుదల తర్వాత ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.