పుష్ప 2 ఐటెం సాంగ్ లో కాజల్ ?

-

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా పుష్ప . నిజానికి బాలీవుడ్లో ప్రమోషన్స్ చేయకుండానే సినిమా విడుదల చేసి రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ ఫేమ్ దేశవ్యాప్తంగా పాకిపోయిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేయకపోయినా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. అయితే.. పుష్ప 2 సినిమాలో కూడా ఐటెం సాంగ్‌ కూడా ఉండనుందట. అయితే.. ఈ సారి సమంతను కాకుండా.. మరో హీరోయిన్‌ ను బరిలోకి దించేందుకు సుకుమార్‌ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆ స్పెషల్ సాంగ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే పుష్ప ది రైజ్ లో సమంత చేసిన ఊ అంటావా మామ సాంగ్ సూపర్ గా పాపులర్ అవడంతో సెకండ్ పార్ట్ లో కాజల్ తో సాంగ్ చేయించాలని భావించారట సుకుమార్. అయితే దీనిపై పుష్ప యూనిట్ నుండి మాత్రం అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news