`పుష్ప‌` గ్లింప్స్ ఆఫ్ ప్రీ ప్రొడ‌క్ష‌న్‌!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. లాక్‌డౌన్ బిఫోర్ బ‌న్నీ లేకుండానే షూటింగ్ జ‌రుపుకున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ గ‌త కొంత ఏడు నెల‌లుగా నిలిచిపోయిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ఈ మంగ‌ళ‌వారం నుంచి చిత్ర బృందం ప్రారంభించ‌బోతోంది. దీనికి సంబంధించిన గ్లిప్స్‌ని రిలీజ్ చేసింది. చాలా కాలంగా చిత్రీక‌ర‌ణ నిలిచిపోయిన ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా? అని బ‌న్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వారికి మేక‌ర్స్ గ్లింప్స్‌తో గుడ్ న్యూస్‌ని అందించారు.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ వర్క్‌కి సంబంధించిన గ్లింప్స్ ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. ఎర్ర‌చంద‌నం స్ల‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బ‌న్నీ ఇందులో లారీ డ్రైవ‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. విల‌న్ పాత్ర కోసం ఎంపిక చేసిన విజ‌య్ సేతుప‌తి ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆ పాత్ర‌లో న‌టించే న‌టుడి కోసం సుక్కు అన్వేషిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన సునీల్‌శెట్టి ఈ పాత్ర‌లో న‌టించే అవ‌కాశం వుంద‌ని తాజాగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news