పుష్ప హవా తగ్గేదే లే.. ఆ దేశంలో కూడా రిలీజ్‌కు సిద్ధం!

-

అల్లుఅర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా దీని జోరు తగ్గలేదు. ఇటీవల ఈ సినిమాను మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన చిత్రాల కేటగిరిలో పుష్ప తెలుగు వర్షన్‌ సినిమాను ఇంగ్లిషు, రష్యన్‌ సబ్‌ టైటిల్స్‌తో ప్రదర్శించడం విశేషం.

అతి త్వరలో ఈ సినిమా రష్యన్‌ డబ్బింగ్‌ వర్షన్‌ను కూడా విడుదల చేయనున్నారు. గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన ఈ సినిమాను మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో డబ్‌ చేశారు. అల్లుఅర్జున్‌ పాపులర్‌ డాన్స్‌ నంబర్‌ అయిన ‘శ్రీవల్లి’ పాటతో పాటు సమంతా నటించిన ‘‘ఊ అంటావా ఊఊ అంటావా’’ పాటలు సోషల్‌మీడియాను హోరెత్తించాయి.

ఇటీవలే న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌లో భారతదేశం తరపున హజరైన ఈ యంగ్‌ హీరో యాన్యువల్‌ డే పెరడ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం అల్లుఅర్జున్‌ ‘పుష్ప:ది రూల్‌’లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news