పుష్ప-2 నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్..‘పుష్ప’ చిత్రంతో ఐకాన్ స్టార్ ప్లస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ‘పుష్ప’ రాజ్ గా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షక లోకం ఫిదా అయింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ ప్రజానీకం…ఈ సినిమా చూసి సర్ ప్రైజ్ అయింది.

బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ‘పుష్ప’ పిక్చర్ చూసి వావ్ అన్నారు. సుకుమార్-బన్నీలు వెండితెరపై మ్యాజిక్ చేశారని తెగ కొనియాడారు. ఇప్పటికీ ‘పుష్ప’ మేనియా ఇంకా కొనసా..గుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే మేకర్స్ పుష్ప-2 కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో అనగా ‘పుష్ప’రాజ్ ..సీక్వెల్ లో.. ఎవరూ ఊహించని సర్ ప్రైజెస్ ను దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇవాళ జరిగింది. అల్లు అర్జున్‌ యూఎస్‌ లో ఉండటంతో.. ఈ పూజా కార్యక్రమం దర్శకుడు సుకుమార్‌ చేతుల మీదుగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news