సైన్సు పాఠం : సరికొత్త వాట‌ర్ ప్యూరిఫైయ‌ర్ ఇదే..మీకు తెలుసా?

-

పటికను నీళ్లలో ఉండే మట్టిని తొలగించి నీళ్లను శుభ్రం చేయటానికి ఉపయోగించేవారు.. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్లు వచ్చాయి కానీ..మన పూర్వీకులకు ఇవేవి తెలియవు కదా..వాటర్ ను క్లీన్ చేయడానికి వారు పటికనే వాడేవారు. ఈతం వారికి అసలు పటిక అంటే చాలామందికి తెలయకపోవచ్చు. పటిక ఎలా వాటర్ ను క్లీన్ చేస్తుంది. నార్మల్ వాటరేనా..తాగేనీళ్లలో కూడా పటిక వేసుకోవచ్చా, ఇలా చేయటం వల్ల ఏం లాభం ఉంటుంది..ఈ విషయాలు అన్నీ తెలుసుకుందాం.

పటిక అనేది అల్యూమినియమ్ సల్ఫేట్( Aluminum Sulphate). ఈ అల్యూమినియమ్ అయాన్స్ అనేవి నీళ్లలో ఉండే మట్టి అణువును పట్టుకుంటాయి. అలా పట్టుకునే సరికి మట్టి అణువులు బరువెక్కిపోతాయి. ఆ బరువుకి నీళ్లలోంచి డౌన్ అయి..కిందపడిపోతాయి. అంటే..నీళ్లలో ఉండే మట్టి అణువులన్నింటిని కిందకు తీసుకెళ్లిపోతాయి. పైన ఉన్న వాటర్ అంతా క్లీన్ అయిపోతుంది. మనం తెలియకుండా నీళ్లలో ఉండే మట్టి అణువులను తాగేస్తుంటాం. అవి హానికలిగించేవి. అందుకే ఇప్పుడు ప్యూరిఫైయర్ వాడుతుంటారు..పూర్వంరోజుల్లో కాలువలు, చెరువులు లోంచి వాటర్ తెచ్చుకుని వాడేవారు. అప్పుడు అందులో ఒక పటిక వేసుకుని ఉపయోగించేవారు.

నీళ్లలో పటిక వేయటం వల్ల కలిగే లాభాలు..

నీళ్లలో ఉండే బాక్టీరియాను పటికలో ఉండే అల్యూమినియం సల్ఫేట్ చంపేస్తుందని సైంటిఫిక్ గా నిరూపించారు.
నీళ్లలో ఉండే రేడియేషన్ ఎఫెక్ట్..యూవీరేస్ వల్ల వచ్చేవి కానీ, లేజర్ ఎఫెక్ట్ వల్ల కానీ వచ్చే రేడియేషన్స్ ను నీటి నుంచి తొలగించడానికి పటిక ఉపయోగపడుతుంది.
పటికను వ్యాక్సిన్ తయారిలో కూడా ఉపయోగిస్తారట. వ్యాక్సిన్ ఎక్కువ కాలం పనిచేయానికి అల్యూమినియం సల్ఫేట్ ను వాడతారు.

ఏ వాటర్ లో ఎంతెంత పటిక వేయాలి?

ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ను క్లీన్ చేయాలన్నప్పుడు ఒక లీటర్ కు 85 మిల్లీగ్రాముల పటిక వేయాలి. కాలవ నీరు, చెరువు నీరు, బోర్ వాటర్ కూడా అప్పుడప్పుడు మురికివస్తుంది ఇలాంటి వాటికన్నింటికి ఇదే మోతాదులో వాడితే సరిపోతుంది.

తాగేనీటిలో మట్టిని, మలినాలను తీయాలంటే..లీటర్ నీళ్లలో 10-15 మిల్లీగ్రాములు వేస్తే చాలు. ఐదు లీటర్ల నీళ్లు తాగాలనుకుంటే అందులో 50 మిల్లీగ్రాముల పటిక వేయండి. పదినిమిషాల్లోనే నీళ్లలో ఉండే మట్టి, మురికి అంతా దిగువ భాగానికి వెళ్తుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పటిక ఒక కేజీ ధర 150-200వరకు ఉంటుంది.

నీళ్లు జీవనాధారం..ఆకలి తట్టుకోవచ్చు. కానీ..దాహాన్ని మాత్రం ఆపుకోలేం. కలుషితమైన నీళ్లు తాగటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదు..కంటికి కనిపించని చాలా క్రిములు నీటిలో ఉంటాయి. ఇవి ప్రేగులకు ఇరిటేషన్ కలిగిస్తాయి. ఇంకా రకరకాల ఇబ్బందులను తెచ్చిపెడుతుంటాయి. వాటిని తొలగించుకుని స్వచ్ఛమైన నీరు తాగాలని అందరూ అనుకుంటారు. అలా అన్ని ఇళ్లలో వేలకు వేలు  ఖర్చుచేసి.. ప్యూరి‌ఫైయర్లు తేలేం.. మన బడ్జెట్ కు వచ్చే పటికను తెచ్చుకుని.. తాగేనీళ్లలో పైన చెప్పిన మోతాదులో వేసుకుని తాగితే.. ఎలాంటి క్రిములు, మట్టిఅణువులైనా కిందకు వెళ్లిపోతాయి.. పైన వాటర్ ను తాగేయొచ్చు. సైంటిఫిక్ గా కూడా నిరూపించబడింది కాబట్టి..అవసరానికి తగ్గుట్టుగా వాడుకోవచ్చు. ఒకసారి మీరు వాడే నీళ్లలో వేసి చూస్తే.. మనకే అర్థమవుతుంది.. ఎంతెంత మురికి కిందకు వెళ్తుందో.!

Read more RELATED
Recommended to you

Latest news