తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం లో అసలు టాస్క్ ఇప్పుడే మొదలైందని.. ఇండ్లలో బురద…కరెంట్.. నీళ్ళ సమస్య ఉందని పేర్కొన్నారు. అలాగే.. ఇక్కడ దొంగల భయం మొదలైం దన్నారు. సీ ఎం కేసీఆర్ 10 వేలు ఇస్తా అన్నారు.. అది మరో ghmc 10 వేలు లొల్లి ఐతదేమో చూసుకోవాలని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
అదే పెద్ద లొల్లని… ఏపీ..ముంపు గ్రామాలు పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కాగా.. నిన్న భద్రాచలంలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ముంపు బాధిత కుటుంబాలకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వరద బాధితులకు రూ.10వేలు, 20 కిలోల బియ్యం ఇస్తామని చెప్పారు. భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే పువ్వాడ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.