నేను పెద్ద కోటీశ్వరున్ని…ఇప్పుడే కోట్లు రాలుతాయి : ఆర్. నారాయణమూర్తి

ఆర్‌. నారాయణ మూర్తి ఈయన గురించి తెలియని వారుండరు. ఎందుకంటే ఎన్నో.. ప్రజా సమస్యలపై సినిమాలు తీసి… తెలుగు ప్రేక్షకులకు గుండెల్లో నిలిచారు ఆర్‌. నారాయణ మూర్తి. అయితే.. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్‌. నారాయణ మూర్తి. తాను చాలా సంతోషంగా ఉన్నానని.. తన దగ్గర కోట్ల డబ్బు ఉందని పేర్కొన్నారు.

అంతేకాదు తాను కోటీశ్వరున్నని… తనకు ఏదైనా అవసరం వస్తే.. పరిశ్రమ పెద్దలతో పాటు ఎంతో మంది తనకు సహయం చేస్తారని ఆర్‌. నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

అన్నింటికీ మించి ప్రేక్షక దేవుల్లు తనను గుండెళ్లో పెట్టుకుని ప్రేమిస్తారని.. వాళ్లు తనకు కోట్ల రూపాయలు ఇస్తున్నారని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. రైతన్న సినిమాను కూడా ఎప్పుడు రిలీజ్‌ చేద్దామా అని ఆతృతగా ఉన్నానని.. తాను దీనస్థితిలో ఉన్నానంటూ సోషల్‌ మీడియాలో వార్తలు రావడం తనకు చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్‌. నారాయణ మూర్తి.