చక్కనమ్మా చిక్కినా అందమే..స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మి

-

‘కాంచన మాల కేబుల్ టీవీ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. ‘కాంచన’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఈ భామ. తెలుగు ప్రేక్షకులకూ ఈ భామ ఐటెం గర్ల్ గా సుపరిచితం. మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.

‘తోబా తోబ’ అనే ఐటెం సాంగ్‌తో పవన్ అశేష అభిమానులను అలరించిన ఈ సుందరి..ఇప్పుడు ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ముద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ సడెన్ గా సన్నగా మారిపోయింది. చక్కనమ్మా చిక్కినా అందమే అన్నట్లుగా తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది.

సదరు ఫొటోల్లో తెలుపు రంగు డ్రెస్సులో ఏంజెల్‌లా మెరిసి పోతున్నది ఈ సుందరి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రాయ్ లక్ష్మికి ఏమైంది ? ఇంత సన్నబడిందా? అని అనుకుంటున్నారు. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ ‘రాణీ రానమ్మ, రౌడీ బేబీ, ఝాన్సి IPS, టిప్సి’ చిత్రాలలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

Read more RELATED
Recommended to you

Latest news