రాధేశ్యామ్ విడుదల తేదీ ఖరారైనట్టేనా..?

Join Our Community
follow manalokam on social media

ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ ప్రకటన వెలువడినప్పటి నుండి వరుస పెట్టి మరీ సినిమా విడుదల తేదీలు ప్రకటించారు చిత్ర నిర్మాతలు. దాదాపుగా ప్రతీ చిత్ర విడుదల తేదీ వచ్చేసింది. ఐతే అన్ని సినిమాల విడుదల తేదీలు వచ్చినప్పటికీ రాధేశ్యామ్ విడుదల తేదీ విషయంలో మాత్రం సంధిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై చిత్ర బృందం స్పందించకపోవడంతో ప్రభాస్ అభిమానుందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

ఐతే తాజాగా ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో రాధేశ్యామ్ రిలీజ్ డేట్ గురించి ఒకానొక వార్త చక్కర్లు కొడుతుంది. జులై 30వ తేదీన రాధేశ్యాఅమ్ విడుదల తేదీ అంటూ వార్తలొస్తున్నాయి. ఇప్పటికే జులై 16వ తేదీన కేజీఎఫ్ 2 విడుదల అవుతుంది. అటు ఆగస్టు 13వ తేదీన పుష్ప రెడీగా ఉంది. ఈ రెండు సినిమాల మధ్యలో రాధేశ్యామ్ ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరి ఈ విషయమై చిత్రబృందం ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి.

TOP STORIES

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా మొదలైంది?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మనందరికి తెలుసు. ఈ మహిళా దినోత్సవం వేడుకలు చేసుకోవడానికా? లేదా ఆందోళనలు నిర్వహించడానికా? అసలు దేనికోసం నిర్వహించుకుంటారో తెలుసా? శతాబ్దం కిందట...